Congress President Oath Ceremony: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగాా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో 98వ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 24 ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కీలక నాయకులందరూ హాజయ్యారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై మల్లికార్జున ఖర్గే విజయం సాధించిన విషయం తెలిసిందే. బాథ్యతలు స్వీకరించిన ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మార్పు కోరుకుంటుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని.. ప్రజాస్వామ్య విలువల ముందు తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఎలా అనేది అతిపెద్ద సవాలు అని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కలిసి బలమైన శక్తిగా మారతారని.. మన గొప్ప దేశం ముందున్న సవాళ్లను కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ఎదుర్కోగలదని తనకు నమ్మకం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా పెద్ద సంక్షోభాలను ఎదుర్కొందని.. అందరూ కలిసి దృఢ సంకల్పంతో, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు సోనియా గాంధీ.
మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో పార్టీ స్ఫూర్తి పొందుతుందని ఆమె అన్నారు. మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే తాను ఉపశమనం పొందానని అన్నారు. ఇన్నేళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమ, గౌరవం తాను ఎప్పటికీ మర్చిపోలేనని.. తన జీవితపు చివరి శ్వాస వరకు గుర్తుపెట్టుకుంటానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులిగా తాను సామర్థ్యానికి తగినట్లుగా చేయగలిగినంత చేశానని అన్నారు. ఇప్పుడు ఈ బాధ్యత ఖర్గేపై ఉందన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. 'ఇది నాకు ఎమోషనల్ మూమెంట్. కూలీ కొడుకుని, సామాన్య కార్యకర్తను పార్టీ అధ్యక్షుడిగా చేసినందుకు కాంగ్రెస్ సభ్యులకు కృతజ్ఞతలు. ఇది క్లిష్ట సమయమని నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రజాస్వామ్యాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి..' అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించారని, ఈ యాత్ర దేశంలో కొత్త శక్తిని నింపుతోందని మల్లికార్జున్ ఖర్గే కొనియాడారు.
Also Read: Weavers Welfare Schemes: చేనేత రంగం కోసం కేంద్రం నయా పైసా ఇవ్వలేదన్న మంత్రి కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook